కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORG వెబ్‌సైట్‌

ఓ ప్రచురణను కనుగొనడం

ఓ ప్రచురణను కనుగొనడం

jw.orgలోని ప్రచురణలు అనే టాబ్‌లో వందలాది డిజిటల్‌, ఆడియో మరియు వీడియో ఫైళ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు కావలసిన ప్రచురణను కనుగొనేందుకు కింది సలహాలు ఉపయోగపడతాయి.

 మీకు కావాల్సిన టైటిల్‌ ఉన్న ప్రచురణను కనుగొనడం

ఓ ప్రచురణకు సంబంధించిన టైటిల్‌ గానీ, టైటిల్లోని ఓ భాగంగానీ మీకు తెలిస్తే, ఆ ప్రచురణను త్వరగా కనుగొనేందుకు కింద వివరించిన పద్ధతిని ఉపయోగించండి.

ప్రచురణలు అనే టాబ్‌ కింద > పుస్తకాలు & బ్రోషుర్‌లు క్లిక్‌ చేయండి.

  • అన్ని ఐటెమ్స్‌ అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టు క్లిక్‌ చేసి, అందులో మీరు వెతికే ప్రచురణ టైటిల్లోని ఓ పదాన్ని టైప్‌ చేయండి. ఉదాహరణకు, మీరొకవేవ బైబిలు బోధిస్తుంది అనే పుస్తకం కోసం చూస్తుంటే “బోధిస్తుంది” అని టైప్‌ చేయండి. అప్పుడు డ్రాప్‌-డౌన్‌ లిస్టులో కేవలం “బోధిస్తుంది” అన్న పదం ఉన్న టైటిల్‌తో కనిపించే ప్రచురణలు మాత్రమే వస్తాయి. మీరు వెతికే పుస్తకానికి సంబంధించిన టైటిల్ని సెలక్ట్‌ చేసుకోండి.

  • వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

 మీకు కావాల్సిన అంశం ఉన్న పత్రికలను కనుగొనడం

ప్రచురణలు అనే టాబ్‌ కింద > పత్రికలు క్లిక్‌ చేయండి.

ఈ పేజీలో మొదట మీకు కనిపించేవి: ఇటీవలి నాలుగు తేజరిల్లు, కావలికోట (సార్వజనిక పత్రిక) సంచికలు మరియు ఇటీవలి ఎనిమిది కావలికోట అధ్యయన మరియు సింప్లిఫైడ్‌ సంచికలు. (కొన్ని భాషల్లో ఈ సంచికలన్నీ లేవు.) మీకు కావాల్సిన సంచికను కనుగొనడానికి కింది విధంగా చేయండి:

  • డ్రాప్‌-డౌన్‌ లిస్టులో మీకు కావాల్సిన సంచికను, అది విడుదలైన సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి.

  •   వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

ప్రచురణ అందుబాటులో ఉండే ఫార్మాట్లు కనుగొనడం

ప్రచురణలు రెండు విధాలుగా చూపించబడతాయి—గ్రిడ్‌ రూపంలో మరియు పట్టిక రూపంలో.

ప్రచురణలు పట్టికరూపంలో చూసేందుకు గ్రిడ్‌ చూపించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ముందుగా గ్రిడ్‌ రూపమే కనబడుతుంది.

గ్రిడ్‌ చూపించు అనే రూపం ప్రచురణ కవర్‌ని, డౌన్‌లోడ్‌ గుర్తులు మరియు ప్రతీ ప్రచురణ టైటిల్‌ను చూపిస్తుంది. ఏ ఫార్మాట్లలో (డిజిటల్‌ లేక ఆడియో) డౌన్‌లోడ్‌ అందుబాటులో ఉందో తెలుసుకునే ఓ విధానం, డౌన్‌డోడ్‌ గుర్తుపై మీ మౌస్‌ను నిలిపి ఉంచండి (లేక మొబైల్‌ పరికరంలో అయితే వేలితో టచ్‌ చేయండి.)

కనిపించే విధానాన్ని మార్చేందుకు పట్టిక చూపించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి

ప్రతీ ప్రచురణ అందుబాటయ్యే అన్నీ ఫైల్‌ ఫార్మాట్‌లను పట్టిక చూపించు అనే రూపం చూపిస్తుంది.

కొన్ని ప్రచురణలు పెద్ద అచ్చు లాంటి అదనపు ఫార్మాట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు (PDF) లాంటి ఓ ఫైల్‌ ఫార్మాట్‌ను క్లిక్‌ చేస్తే, ఆ ఫార్మాట్‌లో లభించే అన్ని ప్రతులను ఓ డైలాగ్‌ బాక్స్‌లో చూడగలరు. ఇప్పుడు మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకునే ప్రతిని క్లిక్‌ చేయండి.

 మీకు కావాల్సిన సమాచారమున్న ప్రచురణను కనుగొనడం

ఓ ప్రచురణ ఆన్‌లైన్‌లో చదివేందుకు వెబ్‌ పేజీల రూపంలో ఉంటే, మీరు చూడాలనుకుంటున్న పదాలు లేక పదబందాలున్న ఓ ఆర్టికల్‌ లేక చాప్టర్‌ కనుగొనేందుకు సైట్‌సర్చ్‌ ఆప్షన్‌ని ఉపయోగించండి. (ఈ ఆప్షన్‌ తెలుగులో ఇంకా అందుబాటులోకి రాలేదు.)

వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. టైప్‌ చేయడానికి అనుకూలంగా ఉన్న బాక్స్‌లో, మీకు కావాల్సిన పదాలు లేక పదబందాలను టైప్‌ చేసిన తర్వాత వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ఓ ప్రచురణలో ఉన్న పదాలు లేక పదబందాలు మీకు తెలిసి ఉంటే వాటన్నిటిని టైప్‌ చేయండి. ఇది మీకు కావాల్సిన చాప్టర్‌ లేక ఆర్టికల్‌లోని పదాలను దగ్గరగా ఉన్న ఫలితాలను చూపిస్తుంది.

కింద చెప్పిన పద్ధతి ద్వారా ప్రచురణా సంచికలను మాత్రమే వెదకండి:

  • మెరుగైన సర్చ్‌ లేక మెరుగైన ఆప్షన్లు అనే లింకును క్లిక్‌ చేయండి.

  • విభాగము హెడ్డింగ్‌ కింద, ప్రచురణలు అనే బాక్సులో టిక్కు పెట్టండి.

  • వెతుకు బటన్‌ను క్లిక్‌ చేయండి.