కంటెంట్‌కు వెళ్లు

JW బ్రాడ్‌కాస్టింగ్‌

రోకు ప్లేయర్‌లో ఆడియో వినండి

రోకు ప్లేయర్‌లో ఆడియో వినండి

ఆడియో సెక్షన్‌లో చాలా ఆడియో కలెక్షన్‌లు ఉంటాయి. వాటిలో మ్యూజిక్‌, నాటకాలు, నాటక రూపంలో సాగే బైబిలు పఠనాలు కూడా ఉంటాయి.

(గమనిక: మీ రోకు ప్లేయర్‌ రిమోట్‌ ఈ ట్యుటోరియల్‌లోని చిత్రాల్లో చూపించినదానికి వేరుగా ఉండవచ్చు.)

హోమ్‌ స్క్రీన్‌లోని ఆడియో ట్యాబ్‌ మీద క్లిక్‌ చేస్తే అందుబాటులో ఉన్న ఆడియో కలెక్షన్‌లను చూడవచ్చు. కావాల్సిన ఆడియో కార్యక్రమాలను కనుక్కొని, వినాలంటే ఇలా చేయండి:

 ఒక ఆడియో కార్యక్రమాన్ని వినండి

ప్రతీ అడ్డ వరుస, ఆడియో కార్యక్రమాల ఒక కలెక్షన్‌ను సూచిస్తుంది. ఆ కలెక్షన్‌ పేరు పైన కనిపిస్తుంది.

  • పై బాణం గుర్తు, కింద బాణం గుర్తు: ఒక కలెక్షన్‌ నుండి ఇంకో కలెక్షన్‌లోకి వెళ్లడానికి ఉపయోగించండి.

  • ఎడమ బాణం గుర్తు, కుడి బాణం గుర్తు: ఒక కలెక్షన్‌లోని ఆడియో కార్యక్రమాల్లో ఒకదాని నుండి ఇంకోదానికి వెళ్లడానికి ఉపయోగించండి.

హైలైట్‌ అయిన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుని, ఆడియో ప్రోగ్రామ్‌ డీటేల్స్‌ స్క్రీన్‌ని లోడ్‌ చేసుకోవడానికి OK నొక్కండి.

కిందున్న వాటిలో ఏదోక దాన్ని ఎంచుకోండి:

  • రెజ్యూమ్‌: మీరు ఒక ఆడియో కార్యక్రమాన్ని ప్లే చేయడం మొదలుపెట్టి మధ్యలో ఆపినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే, ఎక్కడ ఆపారో అక్కడి నుండి ప్లే అవుతుంది.

  • ప్లే లేదా ప్లే ఫ్రమ్‌ బిగినింగ్‌: ఆడియో కార్యక్రమాన్ని మొదటినుండి ప్లే చేస్తుంది.

  • ప్లే ఆల్‌ ఇన్‌ ద కలెక్షన్‌: ప్రస్తుతం స్క్రీన్‌ మీద కనిపించే దానితో మొదలుపెట్టి మీరు ఎంచుకున్న కలెక్షన్‌లో ఉన్న అన్ని ఆడియో కార్యక్రమాలు ప్లే అవుతాయి. ఒక కలెక్షన్‌లోని అన్ని కార్యక్రమాలను ప్లే చేసిన తర్వాత ప్లేబ్యాక్‌ ఆగిపోతుంది.

ఆడియో ప్రోగ్రామ్‌ డీటేల్స్‌ స్క్రీన్‌ కింద ఉన్న అడ్డ వరుస ప్రస్తుత కలెక్షన్‌లోని మిగతా ఆడియో కార్యక్రమాలను చూపిస్తుంది. దాని దగ్గరకు వెళ్లడానికి కింది బాణం గుర్తును, తిరిగి ఆడియో ప్రోగ్రామ్‌ డీటేల్స్‌ స్క్రీన్‌ దగ్గరికి వెళ్లడానికి పై బాణం గుర్తును ఉపయోగించండి.

 ఒక ఆడియో కలెక్షన్‌ను వినండి

ఒక్కొక్క ఆడియో కార్యక్రమాన్ని వినడంతోపాటు, మీరు ఒక కలెక్షన్‌ మొత్తం వినవచ్చు. మీరు వినాలనుకున్న ఆడియో కలెక్షన్‌ దగ్గరికి వెళ్లి మీరు ఈ పనులు చేయవచ్చు:

  • ప్లే ఆల్‌: ఒక కలెక్షన్‌లోని అన్ని ఆడియో కార్యక్రమాలను మొదటి నుండి వరుసగా వినడానికి ప్లే ఆల్‌ ఎంచుకోండి.

  • షఫుల్‌: ఒక కలెక్షన్‌లోని అన్ని ఆడియో కార్యక్రమాలను ఉన్న క్రమంలో కాకుండా ఏదోక క్రమంలో వినడానికి షఫుల్‌ చేయి ఆప్షన్‌ ఎంచుకోండి.

ఒక కలెక్షన్‌లోని అన్ని ఆడియోలను ప్లే చేసిన తర్వాత ప్లేబ్యాక్‌ ఆగిపోతుంది.

 ఆడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగించండి

ఒక ఆడియో ప్లే అవుతున్నప్పుడు, మీ రిమోట్‌తో కింది పనులు చేయవచ్చు:

  • ప్లే/పాజ్‌ లేదా OK: ప్లే అవుతున్న ఆడియో ఆగుతుంది. అదే బటన్‌ మళ్లీ నొక్కితే, ఆగినచోటు నుండి ఆడియో ప్లే అవుతుంది.

  • స్కిప్‌ పార్వర్డ్‌: కొన్ని క్షణాలు దాటేసి ముందుకు వెళ్లవచ్చు. బటన్‌ అలాగే నొక్కి పట్టుకుంటే, ఆడియో కార్యక్రమం కాస్త త్వరగా ముందుకు వెళ్తుంది. బటన్‌ వదిలితే అక్కడి నుండి ప్లే అవుతుంది.

  • స్కిప్‌ బ్యాక్‌: కొన్ని క్షణాలు వెనక్కి వెళ్లవచ్చు. బటన్‌ అలాగే నొక్కి పట్టుకుంటే, ఆడియో మొదటికి వెళ్లవచ్చు. బటన్‌ వదిలితే అక్కడి నుండి ప్లే అవుతుంది.

  • బ్యాక్‌: తిరిగి ఆడియో స్క్రీన్‌కి వెళ్లవచ్చు.