JW బ్రాడ్‌కాస్టింగ్
రోకు ప్లేయర్‌లో వీడియోలు చూడండి
మీరు ఏ వీడియోనైనా ప్లేబ్యాక్ ఆప్షన్‌లను (అంటే పాజ్, రివైండ్, ఫాస్ట్‌ఫార్వర్డ్, స్కిప్ వంటివి) ఉపయోగించి చూడవచ్చు. ఒక వీడియోను గానీ ఒక కేటగిరీలో లేదా కలెక్షన్‌లో ఉన్న అన్ని వీడియోలను గానీ చూడవచ్చు.
(గమనిక: మీ రోకు రిమోట్ ఈ ట్యుటోరియల్ చూపించిన దానికి కాస్త వేరుగా ఉండవచ్చు.)
ఒక వీడియోను ఎంచుకొని చూడండి
హోమ్ స్క్రీన్ పైన ఉన్న నావిగేషన్ ఉపయోగించి వీడియో కేటగిరీలు ఎంచుకుంటే, అందుబాటులో ఉన్న వీడియో కేటగిరీలు కనిపిస్తాయి. మీ రోకు రిమోట్ మీదున్న బాణం గుర్తులు ఉపయోగిస్తూ కేటగిరీల్లో ఏమేం ఉన్నాయో చూడండి. హైలైట్ అయిన విభాగాన్ని ఎంచుకోవడానికి OK బటన్ నొక్కండి.
కొన్నిసార్లు, ఒక కేటగిరీలో ఉన్న వీడియో వేరే కేటగిరీల్లో కూడా కనిపించవచ్చు. ఉదాహరణకు, ద ప్రాడిగల్ రిటన్స్ అనే వీడియో మూవీస్ అనే కేటగిరీలోనే కాకుండా ఫ్యామిలీ, టీనేజర్స్ కేటగిరీల్లో కూడా ఉండవచ్చు.
ఒక కేటగిరీలో ఉన్న అన్ని వీడియోలను ఉన్న క్రమంలో కాకుండా ఏదోక క్రమంలో చూడడానికి షఫుల్ చేయి ఆప్షన్ ఎంచుకోండి.
ప్రతీ కేటగిరీ పేజీలో చాలా కలెక్షన్‌లు ఉంటాయి. ప్రతీ అడ్డ వరుసలో ఉన్న వీడియోలన్నీ ఒక కలెక్షన్ కిందకు వస్తాయి. దాని పైన ఆ కలెక్షన్ పేరు ఉంటుంది.
మీ రిమోట్ సహాయంతో ఒక కలెక్షన్ నుండి ఇంకో కలెక్షన్‌కి వెళ్లండి:
పై బాణం గుర్తు, కింద బాణం గుర్తు: ఒక కలెక్షన్ నుండి ఇంకో కలెక్షన్‌కి వెళ్లడానికి ఉపయోగించండి.
ఎడమ బాణం గుర్తు, కుడి బాణం గుర్తు: ఒక కలెక్షన్‌లోని వీడియోలను స్క్రోల్ చేసి చూడడానికి ఉపయోగించండి.
ఒక కలెక్షన్‌లోని అన్ని వీడియోలను చూడడానికి రెండు పద్ధతులు ఉన్నాయి:
ఒక కలెక్షన్‌లోని అన్ని వీడియోలను మొదటి నుండి వరుసగా చూడడానికి అన్నీ ప్లే చేయి ఎంచుకోండి.
ఒక కలెక్షన్‌లోని అన్ని వీడియోలను ఉన్న క్రమంలో కాకుండా ఏదోక క్రమంలో చూడడానికి షఫుల్ చేయి ఆప్షన్ ఎంచుకోండి.
గమనిక: ఒక కలెక్షన్‌లోని అన్ని వీడియోలను ప్లే చేసిన తర్వాత ప్లేబ్యాక్ ఆగిపోతుంది.
ఒక వీడియోను ఎంచుకుంటే, వీడియో వివరాలు స్క్రీన్ కనిపిస్తుంది. అందులో నుండి కింది వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి.
రెజ్యూమ్: మీరు ఒక వీడియోను ప్లే చేయడం మొదలుపెట్టి మధ్యలో ఆపినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే, ఎక్కడ ఆపారో అక్కడి నుండి ప్లే అవుతుంది.
ప్లే చేయి లేదా మొదటినుండి ప్లే చేయి: వీడియో మొదటినుండి ప్లే చేస్తుంది.
సబ్‌టైటిల్స్‌తో ప్లే చేయి: ప్లే అవుతున్న వీడియోకి సబ్‌టైటిల్స్ ఉంటేనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ప్లే అవుతున్న వీడియో అలాగే మిగతా అన్ని వీడియోలు (వాటికి సబ్‌టైటిల్స్ ఉంటే) సబ్‌టైటిల్స్‌తో ప్లే అవుతాయి. సబ్‌టైటిల్స్ వద్దనుకుంటే, సబ్‌టైటిల్స్ లేకుండా ప్లే చేయి ఆప్షన్ ఎంచుకోండి.
ఒక కలెక్షన్‌లో ఉన్న వీడియోలన్నీ ప్లే చేయి: మీరు ఎంచుకున్న వీడియోతో మొదలై కలెక్షన్‌లో ఉన్న అన్ని వీడియోలు ప్లే అవుతాయి. ఒక కలెక్షన్‌లోని అన్ని వీడియోలను ప్లే చేసిన తర్వాత ప్లేబ్యాక్ ఆగిపోతుంది.
వీడియో వివరాలు స్క్రీన్ కింద ఉన్న అడ్డ వరుస ప్రస్తుత కలెక్షన్‌లోని మిగతా వీడియోలను చూపిస్తుంది. దాని దగ్గరకు వెళ్లడానికి కింది బాణం గుర్తును, తిరిగి వీడియో వివరాలు స్క్రీన్ దగ్గరికి వెళ్లడానికి పై బాణం గుర్తును ఉపయోగించండి.
వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్‌లను ఉపయోగించండి
ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు, మీ రిమోట్‌తో కింది పనులు చేయవచ్చు:
ప్లే/పాజ్: ప్లే అవుతున్న వీడియో ఆగుతుంది. అదే బటన్ మళ్లీ నొక్కితే, ఆగినచోటు నుండి వీడియో ప్లే అవుతుంది.
కుడి: వీడియోను కొన్ని క్షణాలు దాటేసి ముందుకు వెళ్లవచ్చు. బటన్ అలాగే నొక్కి పట్టుకుంటే, ఇంకా త్వరగా ముందుకు వెళ్తుంది. మీకు కావల్సిన చోటుకు వచ్చినప్పుడు ప్లే బటన్ లేదా OK బటన్ నొక్కండి.
ఫాస్ట్ ఫార్వర్డ్: ఆటోమెటిగ్గా వీడియోలో ముందుకు వెళ్లవచ్చు. మీకు కావల్సిన చోటుకు వచ్చినప్పుడు ప్లే బటన్ లేదా OK బటన్ నొక్కండి.
ఎడమ: వీడియోను కొన్ని క్షణాలు దాటేసి వెనక్కి వెళ్లవచ్చు. బటన్ అలాగే నొక్కి పట్టుకుంటే, ఇంకా త్వరగా వెనక్కి వెళ్తుంది. మీకు కావల్సిన చోటుకు వచ్చినప్పుడు ప్లే బటన్ లేదా OK బటన్ నొక్కండి.
రివైండ్: మీరు త్వరగా వీడియో మొదటికి వెళ్లవచ్చు. మీకు కావల్సిన చోటుకు వచ్చినప్పుడు ప్లే బటన్ లేదా OK బటన్ నొక్కండి.
వెనక్కి: తిరిగి వీడియో వివరాలు స్క్రీన్ దగ్గరికి వెళ్లండి.
“అందుబాటులో ఉన్నవి” వీడియోలు లేదా “తాజా వీడియోలు” చూడండి
JW బ్రాడ్‌కాస్టింగ్ హోమ్ స్క్రీన్‌లో రెండు ప్రత్యేక వీడియో కలెక్షన్‌లు కనిపిస్తాయి.
అందుబాటులో ఉన్నవి: వారంవారం జరిగే కూటాలకు లేదా కుటుంబ ఆరాధనకు సంబంధించిన ప్రత్యేక వీడియోల లాంటివి ఇక్కడ కనిపిస్తాయి.
తాజా వీడియోలు: కొత్తగా చేర్చిన వీడియోలు ఉంటాయి.