అబ్బాయిలు అబ్బాయిలకు, అమ్మాయిలు అమ్మాయిలకు ఆకర్షితులైతే వాళ్లు ‘గే’ అని అర్థమా?
కానే కాదు.
నిజమేమిటంటే: చాలా సందర్భాల్లో అబ్బాయిలు అబ్బాయిలకు, అమ్మాయిలు అమ్మాయిలకు ఆకర్షితులవ్వడం యుక్తవయసులో కొంతకాలం ఉండే దశ.
ఒకానొక సమయంలో తనలాంటి అమ్మాయికి ఆకర్షించబడిన 16 ఏళ్ల లిజిట్ కూడా అదే చెప్తుంది. ఆమె ఇలా అంటోంది, “స్కూల్లో మా బయోలజీ క్లాసుల్లో నేనేమి నేర్చుకున్నానంటే, ఎదిగే వయసులో హార్మోన్ల స్థాయి తీవ్రంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. వయసులో ఉన్న పిల్లలు వాళ్ల శరీరంలో జరిగే మార్పుల గురించి ఎక్కువగా తెలుసుకుంటే, తమలాంటి వాళ్లకు ఆకర్షితులవ్వడం అనేది కొంతకాలం మాత్రమే ఉండే దశ అని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు తాము ‘గే’ ఏమో అన్న ఆందోళనకు వాళ్లు గురికారు.”
ఒకవేళ, ఎంతకాలమైనా ఆ ఆకర్షణ అలానే ఉందని అనిపిస్తుంటే అప్పుడేంటి? అలాంటప్పుడు, అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని వాళ్లకు దేవుడు చెప్పడం తప్పంటారా?
తప్పని మీరంటే, ‘లైంగిక కోరికలను ఎలా అయినా తీర్చుకోవచ్చు’ అని మనుషులు అనుకునే తప్పుడు ఆలోచన మీదే, మీ జవాబు కూడా ఆధారపడి ఉందని తెలుసుకోండి. వికృతమైన విధంగా లైంగిక కోరికలను తీర్చుకునే స్థాయికి దిగజారొద్దు అనే సలహాలతో బైబిలు మానవులను గౌరవిస్తుంది.—కొలొస్సయులు 3:5.
దేవుడు మనల్ని అలా కోరడం సరైనదే. వివాహం కాని అబ్బాయిలను, అమ్మాయిలను ‘జారత్వానికి దూరంగా పారిపొండి
’ అని బైబిలు చెబుతున్నట్లే, అబ్బాయిలతో అబ్బాయిలు, అమ్మాయిలతో అమ్మాయిలు లైంగిక సంబంధం పెట్టుకోకూడదని కూడా బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 6:18) బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించాలనుకుంటున్న లక్షలాది ప్రజలు, పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ల కోరికలను అదుపులో పెట్టుకుంటున్నారు. ఒకే లింగ వ్యక్తుల పట్ల ఆకర్షణ ఉండే వాళ్లు కూడా బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు.—ద్వితీయోపదేశకాండము 30:20.