కంటెంట్‌కు వెళ్లు

దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?

దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవునికి ఒకే ఒక పేరు ఉంది. దాన్ని హీబ్రూ భాషలో יהוה అని రాస్తారు, ఇంగ్లీషు భాషలో “Jehovah” అని రాస్తారు. a దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇలా చెప్పాడు, “యెహోవాను నేనే; ఇదే నా నామము.” (యెషయా 42:8) ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో ఈ పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. దేవుని గురించి ప్రస్తావిస్తూ ఉపయోగించే వేరే ఏ మాట కన్నా, వేరే ఎవ్వరి పేరు కన్నా యెహోవా అనే పేరే ఎక్కువసార్లు కనిపిస్తుంది. b

దేవునికి వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా?

 బైబిలు దేవున్ని ఒకే పేరుతో పిలుస్తున్నప్పటికీ, ఆయనకు వేర్వేరు బిరుదులను, వర్ణనలను ఉపయోగిస్తుంది. వాటిలో కొన్ని కిందున్న లిస్టులో ఉన్నాయి. అయితే అవి ఆయన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తున్నాయో గమనించండి.

బిరుదు

వచనం

అర్థం

అల్లాహ్‌

(ఏమీలేదు)

ఇది అరబిక్‌ భాష నుండి వచ్చింది. అల్లాహ్‌ అనేది ఒక పేరు కాదుగానీ “దేవుడు” అనే అర్థమిచ్చే ఒక బిరుదు. అరబిక్‌, ఇతర భాషల్లోని బైబిలు అనువాదాల్లో “దేవుడు” అనే మాటకు సమానార్థకంగా “అల్లాహ్‌” అనే మాటను వాడారు.

ఆల్ఫా, ఓమెగ

ప్రకటన 1:8; 21:6; 22:13

“మొదటివాడను కడపటివాడను,” “ఆదియు అంతము” అనే మాటలకు అర్థమేమిటంటే, యెహోవా కన్నా ముందు సర్వశక్తిగల ఏ దేవుడూ లేడు, ఆయన తర్వాత కూడా ఏ దేవుడూ ఉండడు అని. (యెషయా 43:10) గ్రీకు అక్షరాల్లో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఓమెగ.

కాపరి

కీర్తన 23:1

తన ఆరాధకుల పట్ల శ్రద్ధ తీసుకునేవాడు.

కుమ్మరి

యెషయా 64:8

కుమ్మరికి మట్టిపై అధికారం ఉన్నట్లు, ఆయనకు మనుషులపై, జనాంగాలపై అధికారం ఉంది.—రోమీయులు 9:20, 21.

కేడెము

కీర్తన 18:2, 46

భద్రతనిచ్చే ఆశ్రయం, రక్షణకు మూలము.

తండ్రి

మత్తయి 6:9

జీవాన్ని ఇచ్చినవాడు.

దేవుడు

ఆదికాండము 1:1

ఆరాధన పొందేవాడు. బలవంతుడు. హీబ్రూ పదమైన ఎలోహిమ్‌ బహువచనం. యెహోవా ఘనత, మహిమ, గొప్పతనం అని దానర్థం.

నేను ఉన్నవాడను అను వాడను

నిర్గమకాండము 3:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌

తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా కావాలనుకుంటే అలా అవుతాడు. ఈ వాక్యాన్ని, “నాకు ఎలా నచ్చితే అలా అవుతాను,” “నేను ఎలా కావాలనుకుంటే అలా అవుతాను” అని కూడా అనువదించవచ్చు. (జె.బి. రోథర్‌హామ్‌ రాసిన ద ఎంఫసైజ్డ్‌ బైబిల్‌, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌) తర్వాతి వచనంలో ఇవ్వబడిన యెహోవా పేరును వివరించడానికి ఈ వివరణ సహాయం చేస్తుంది.—నిర్గమకాండము 3:15.

పరిశుద్ధ దేవుడు

సామెతలు 9:10

వేరే ఎవ్వరికన్నా అత్యంత పరిశుద్ధుడు (నైతికంగా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండేవాడు).

పుట్టించినవాడు

కీర్తన 149:2

అన్నిటినీ తయారుచేసిన వ్యక్తి.—ప్రకటన 4:11.

ప్రభువు

కీర్తన 135:5

యజమాని లేదా ప్రభువు; హీబ్రూలో అదోన్‌, అదోనిమ్‌.

ప్రార్థన ఆలకించువాడు

కీర్తన 65:2

విశ్వాసంతో చేసే ప్రతీ ప్రార్థనను స్వయంగా వినేవాడు.

మహాగొప్ప ఉపదేశకుడు

యెషయా 30:20-21, NW

మనకు ఉపయోగపడే విషయాలను బోధిస్తాడు, నిర్దేశాన్ని ఇస్తాడు.—యెషయా 48:17, 18.

మహాదేవుడు

ద్వితీయోపదేశకాండము 10:17

అత్యున్నతమైన దేవుడు. కొందరు ఆరాధించే ‘వ్యర్థమైన దేవుళ్ల’ లాంటివాడు కాదు.—యెషయా 2:8, NW.

మహావృద్ధుడు

దానియేలు 7:9, 13, 22

ఆది లేదు అని అర్థం. ఎవ్వరూ, ఏదీ ఉనికిలో లేనప్పుడు నుండి ఉన్నవాడు.—కీర్తన 90:2.

మహోన్నతుడు

కీర్తన 47:2; దానియేలు 7:18, 27

అందరికన్నా ఉన్నతుడు, అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు.

యుగయుగాలకు రాజా

ప్రకటన 15:3

ఆయన పరిపాలనకు ఆది, అంతము లేదు.

రక్షకుడు

యెషయా 45:21

ప్రమాదం లేదా నాశనం నుండి తప్పించేవాడు.

రోషముగలవాడు

నిర్గమకాండము 34:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌

వేరేవాళ్లను ఆరాధిస్తే సహించనివాడు. “శత్రువుల్ని సహించని వాడు,” “పూర్తి భక్తిని కోరేవాడిగా పేరు పొందినవాడు” అని కూడా అనువదించబడింది.—గాడ్స్‌ వర్డ్‌ బైబిల్‌; న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేష.న్‌

విమోచకుడు, విడుదల చేసేవాడు

యెషయా 41:14; కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌

యేసు అర్పించిన విమోచన క్రయధన బలి ఆధారంగా మానవజాతిని పాప మరణాల నుండి విడుదల చేసేవాడు లేదా వాటినుండి తిరిగి కొనేవాడు.—యోహాను 3:16.

సంతోషంగల దేవుడు

1 తిమోతి 1:8-11

ఆయన ఆనందంగా, సంతోషంగా ఉంటాడు.—కీర్తన 104:31.

సర్వశక్తిగల దేవుడు

ఆదికాండము 17:1

అమితమైన శక్తిగలవాడని అర్థం. “సర్వశక్తిగల దేవుడు” అనే అర్థమిచ్చే ఎల్‌ షద్దయి అనే హీబ్రూ మాట బైబిల్లో ఏడుసార్లు కనిపిస్తుంది.

సర్వోన్నత ప్రభువు

ఆదికాండము 15:2

అత్యున్నత అధికారం గలవాడు. హీబ్రూలో అదోనయి.

సృష్టికర్త

యెషయా 40:28

అన్నిటినీ ఉనికిలోకి తెచ్చినవాడు.

సైన్యాలకు అధిపతి

యెషయా 1:9

కోటానుకోట్ల దూతల సైన్యానికి అధిపతి.

హీబ్రూ లేఖనాల్లో కొన్ని ప్రాంతాల పేర్లు

 బైబిల్లోని కొన్ని ప్రాంతాల పేర్లకు దేవుని పేరు జత చేసి ఉంది. అంతమాత్రాన అవి యెహోవాకు ఉన్న వేరే పేర్లు కాదు.

ప్రాంతం పేరు

వచనం

అర్థం

యెహోవా నిస్సీ

నిర్గమకాండము 17:15, NW

“యెహోవాయే నా ధ్వజ స్తంభం.” యెహోవా ప్రజలు రక్షణ, సహాయం కోసం ఆయన మీద ఆధారపడవచ్చు.—నిర్గమకాండము 17:13-16.

యెహోవా యీరే

ఆదికాండము 22:13-14, NW

‘యెహోవా చూసుకుంటాడు’ అని అర్థం.

యెహోవా షాలోము

న్యాయాధిపతులు 6:23, 24, NW

“యెహోవాయే శాంతి.”

యెహోవా షమ్మా

యెహెజ్కేలు 48:35, అధస్సూచి, అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌

“యెహోవా అక్కడ ఉన్నాడు.”

దేవుని పేరు తెలుసుకుని, దాన్ని ఉపయోగించడానికి కారణాలు

  •   దేవుడు తన పేరైన యెహోవాను ప్రాముఖ్యమైన దానిగా ఎంచుతున్నాడు. అందుకే ఆయన దాన్ని బైబిల్లో కొన్ని వేలసార్లు ఉండేలా చూశాడు.—మలాకీ 1:11.

  •   దేవుని పేరుకున్న ప్రాముఖ్యతను ఆయన కుమారుడైన యేసు నొక్కి చెప్పాడు. ఉదాహరణకు ఆయన ఒక సందర్భంలో ఇలా ప్రార్థన చేశాడు, “నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్తయి 6:9; యోహాను 17:6.

  •   దేవుని పేరు తెలుసుకుని, దాన్ని ఉపయోగించేవాళ్లు ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టినట్లే. (కీర్తన 9:10; మలాకీ 3:16) అలా స్నేహం చేసేవాళ్లు దేవుడు చేసిన ఈ వాగ్దానం నుండి ప్రయోజనం పొందుతారు: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.”—కీర్తన 91:14.

  •   బైబిలు ఇలా చెప్తోంది, ‘పరలోకంలో గానీ, భూమ్మీద గానీ ప్రజలు దేవుళ్లని అనుకునేవి చాలానే ఉన్నాయి. అలాగే “దేవుళ్లు,” “ప్రభువులు” కూడా చాలామందే ఉన్నారు.’ (1 కొరింథీయులు 8:5, 6) కానీ ఏకైక సత్య దేవుని పేరు మాత్రం యెహోవా అని బైబిలు స్పష్టంగా చెప్తోంది.—కీర్తన 83:18.

a కొంతమంది హీబ్రూ విద్వాంసులు దేవుని పేరును “యావే” అని రాయాలని అభిప్రాయపడతారు.

b దేవుని పేరును కాస్త చిన్నగా చేసి, “Jah,” లేదా “యాహ్‌” అని కూడా పలుకుతారు. “Praise Jah” అనే అర్థమొచ్చే హల్లెలూయా, అల్లెలూయా అనే పదాలతో కలిపి “Jah” అనే పదం బైబిల్లో దాదాపు 50 సార్లు కనిపిస్తుంది.—ప్రకటన 19:1; అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌; కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.