కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 1 2022 | ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా?

లోకంలో పరిస్థితులు అస్సలు బాగుండడం లేదు. మనలో చాలామందిమి వరదలు, భూకంపాలు లాంటి వాటివల్ల గానీ, మనుషులు సృష్టిస్తున్న సమస్యలవల్ల గానీ కష్టాలు పడుతున్నాం. అవి మీ మీద, మీకిష్టమైన వాళ్లమీద కలిగించే ఒత్తిడి అంతాఇంతా కాదు. మరి, ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి ఏం చేయవచ్చు?

 

ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా?

ఏదైనా ఘోరం జరిగినప్పుడు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెంటనే స్పందించండి.

1 | ఆరోగ్యం కాపాడుకోండి

మీరు ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోనప్పుడు అంతబాగా ఆలోచించగలుగుతారు; మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

2 | పొదుపుగా జీవించండి

మీరు ఇప్పుడు డబ్బును ఎంత పొదుపు చేస్తే, పరిస్థితులు తారుమారైనప్పుడు అవి మీకు అంత ఉపయోగపడతాయి.

3 | బంధాల్ని బలపర్చుకోండి

మీ వివాహబంధాన్ని, స్నేహబంధాల్ని, మీ పిల్లలతో మీకున్న అనుబంధాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడే చక్కని చిట్కాలు ఇందులో ఉన్నాయి.

4 | ఆశ వదులుకోకండి

బైబిలు మనకు జీవితంలో వచ్చే కష్టాల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తుంది, భవిష్యత్తు మీద ఆశ నింపుతుంది.

ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?

మనుషులందరూ ఎదుర్కొంటున్న ఒత్తిడికరమైన పరిస్థితుల్ని తట్టుకోవడానికి మీరూ, మీ ఇంట్లోవాళ్లు ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్స్‌ చదివి తెలుసుకోండి.