కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

తేనెటీగ వాలే పద్ధతి

తేనెటీగ వాలే పద్ధతి

తేనెటీగలు ఎగురుతున్నప్పుడు ఏ కోణంలోనైనా ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దిగగలవు. వాటికి అది ఎలా సాధ్యం?

ఆలోచించండి: తేనెటీగ సురక్షితంగా దిగాలంటే దేనిమీదైనా వాలుతున్నప్పుడు వేగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అంటే దాని వేగం దాదాపు సున్నాకు రావాలి. ఇది జరగాలంటే రెండు విషయాల్ని కొలవాల్సి ఉంటుంది. ఒకటి ఎగిరే వేగం, రెండవది తేనెటీగకు దిగాలనుకుంటున్న చోటుకు మధ్య ఉన్న దూరం. ఈ రెండిటిని బట్టి తేనెటీగ దిగే వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. చాలా పురుగులకు ఇది కష్టమే. ఎందుకంటే వాటి కళ్లు దగ్గరదగ్గరగా ఉంటాయి, అవి ఒకే దానిమీద దృష్టి నిలిపి చూడలేవు. కాబట్టి అవి దూరాలను సరిగ్గా కొలుసుకోలేవు.

మనుషులు కంటిచూపుతో ఏదైన వస్తువు ఎంత దూరంలో ఉందో తెలుసుకుంటారు. తేనెటీగల కంటిచూపుకు మనిషి కంటిచూపుకు చాలా తేడా ఉంది. ఒక వస్తువుకు దగ్గరగా వస్తుండగా అది పెద్దగా కనపడుతుందనే నియమం ఆధారంగా తేనెటీగలు వాలే పద్ధతి ఉంటుంది. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో జరిగిన ప్రయోగాలు తేనెటీగలు ఎలా కిందికి దిగుతాయో వివరించాయి. తేనెటీగలు వాలలనుకునే గురికి దగ్గరౌతున్న కొద్దీ ఆ గురి పెరుగుతున్న వేగం మారకుండా అవి ఎగిరే వేగాన్ని తగ్గించుకుంటూ దిగుతాయి. ఆ గురి చేరుకునేసరికి దాని వేగం తగ్గుతూతగ్గుతూ దాదాపు సున్నా అవుతుంది. అలా తేనెటీగలు ఏ ప్రమాదం లేకుండా దిగుతాయి.

ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అనే పత్రిక ఇలా నివేదిస్తుంది: “తేనెటీగ దిగే పద్ధతి సులువైనది, సామాన్యమైనది . . . [కాబట్టి] ఎగిరే రోబోలకు మార్గనిర్దేశాలు ఇచ్చే వ్యవస్థల్లో వాడడానికి ఉపయోగించవచ్చు.”

మీరేమంటారు? తేనెటీగలు వాలడానికి ఉపయోగించే పద్ధతి దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా చేశారా?