విషయాలను దేవుని దృక్కోణం నుండి చూడండి
విషయాలను దేవుని దృక్కోణం నుండి చూడండి
అది 2002వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేది. అమెరికాలోని న్యూయార్క్‌లో వాతావరణం వెచ్చగా సూర్యకాంతితో నిండివుంది. ఆ రోజు 6,521 మందివున్న ఒక అంతర్జాతీయ గుంపు, పాటర్‌సన్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లోను ఆ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులకు చెందిన రెండు ఇతర భవనాలలోను కలుసుకున్నారు. వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు సంబంధించిన 113వ తరగతి గ్రాడ్యుయేషన్‌ను వీక్షించడానికి ఆ గుంపు సమకూడారు. విద్యార్థులు 14 దేశాల నుండి వచ్చారు, వారు తాము నియమించబడే దేశాలలో మిషనరీ సేవకోసం సిద్ధపడడంలో గత ఐదు నెలలు గడిపారు, వారు 19 దేశాల్లో సేవ చేయడానికి నియమించబడ్డారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడైన 97 సంవత్సరాల వయస్సుగల క్యారీ బార్బర్ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆయన, మిషనరీ ప్రాంతంలో సేవచేయడానికి వేలాదిమందిని సిద్ధపరిచిన గిలియడ్ స్కూలుకున్న దాదాపు 60 సంవత్సరాల అనుభవం వైపుకు తన శ్రోతల అవధానాన్ని మళ్ళించారు. సహోదరుడు బార్బర్ ఇలా వ్యాఖ్యానించారు: “వారు పొందిన అదనపు శిక్షణ అద్భుతమైన ప్రతిఫలాలను సాధించిందని మేము చెప్పినప్పుడు అది అతిశయోక్తి కాదు. శిక్షణ పొందిన మిషనరీలు చేసిన సహాయంవల్ల ప్రపంచమంతటా అక్షరార్థంగా వందల వేల మంది వినయమనస్కులు యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకుని సత్యారాధనను పరిశుద్ధ సేవను చేపట్టారు.”
గిలియడ్‌కు హాజరవ్వకముందు విద్యార్థులలోని చాలామంది తమ పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి ఆసక్తిని కనబర్చారు. ఒక వివాహిత జంట, కెనడాలో తమ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న చైనా జాతీయుల్లోని అనేకమందిని చేరుకోవడానికి కృషి చేస్తూ ఒక సంవత్సరంపాటు మాండరిన్ భాష నేర్చుకోవడానికి క్లాసులకు హాజరయ్యారు. మరో జంట తమంతట తామే అల్బేనియన్ భాషను నేర్చుకోవడం ప్రారంభించి, చివరకు అల్బేనియాలో బైబిలుపట్ల పెరుగుతున్న ఆసక్తిని వృద్ధిచేయడానికి అక్కడకు వెళ్ళారు. తరగతిలోని ఇతరులు హంగరీ, గ్వాటిమాల, డొమినికన్ రిపబ్లిక్ దేశాలనుండి గిలియడ్‌కు వచ్చారు. ఆ ప్రాంతాలలో దేవునివాక్య బోధకుల అవసరం ఎక్కువగా ఉండడంవల్ల వారు అక్కడ సేవ చేయడానికి వెళ్ళారు.
ఇప్పుడు ఆఫ్రికా, ప్రాచ్య యూరప్, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ప్రాచ్య దేశాలలో నియామకాలకు బయలుదేరి వెళ్ళేముందు విద్యార్థులందరూ తాము అక్కడ నిర్వహించబోయే పనులన్నింటిలోను దేవుణ్ణి పరిగణలోకి తీసుకోవాలని ప్రోత్సహించబడ్డారు.
విషయాలను దేవుని దృక్కోణం నుండి చూడండి
సహోదరుడు బార్బర్ పరిచయ వ్యాఖ్యానాలు చెప్పిన తర్వాత, అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన మాక్స్‌వెల్ లాయిడ్‌ను పరిచయం చేశారు. ఆయన “అన్ని విషయాలను దేవుని దృక్కోణం నుండి చూడండి” అన్న అంశాన్ని ఉన్నతపర్చారు. సహోదరుడు లాయిడ్ దావీదు మరియు దేవుని కుమారుడైన యేసు ఉదాహరణలవైపుకు శ్రోతల అవధానాన్ని మళ్ళించారు. (1 సమూయేలు 24:6; 26:11; లూకా 22:42) ఐదునెలల పాటు వారు చేసిన బైబిలు అధ్యయనం, విషయాలను దేవుని దృక్కోణం నుండి చూసేందుకు వారికి శిక్షణనిచ్చిందని విద్యార్థులకు గుర్తుచేసిన తర్వాత ప్రసంగీకుడు వారిని ఇలా ప్రశ్నించారు: “మీ క్రొత్త నియామకంలో ప్రజలతో బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తుండగా, వారు విషయాలను దేవుని దృక్కోణం నుండి ఆలోచిస్తూ తర్కించుకునేందుకు మీరు వారికి సహాయం చేస్తారా?” ఇతరులకు ఉపదేశాన్ని ఇచ్చే విషయంలో విద్యార్థులకు ఆయన ఈ సలహా ఇచ్చారు: “‘నా సొంత దృక్కోణం నుండి, నేను అనుకుంటున్న దాన్నిబట్టి . . . ’ అని చెప్పకండి, బదులుగా దేవుని దృక్కోణం ఏమిటో అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయండి. మీరు ఇలా చేస్తే, మీ నియామకంలో మీరు ఎవరితోనైతే సహవసిస్తారో వారికి మీరు నిజమైన ఆశీర్వాదంగా ఉంటారు.”
కార్యక్రమంలో ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన గెరిట్ లూష్ ప్రసంగించారు. “నేను నీకు తోడైయున్నాను” అన్న అంశంపై మాట్లాడుతూ, యెహోవా తన నమ్మకమైన సేవకులతో “నేను నీకు తోడైయున్నాను” అని చెప్పిన అనేక సందర్భాల వైపుకు శ్రోతల అవధానాన్ని మళ్ళించారు. (ఆదికాండము 26:23, 24; 28:15; యెహోషువ 1:5; యిర్మీయా 1:7, 8) మన కాలంలో, నమ్మకంగా కొనసాగితే మనం కూడా యెహోవాపై అలాంటి దృఢనిశ్చయతనే కలిగివుండవచ్చు. సహోదరుడు లూష్ ఇలా అన్నారు: “బైబిలు అధ్యయనం చేయడానికి ప్రజలను కనుగొంటామా లేదా అని మీరు చింతిస్తున్నారా? ‘నేను నీకు తోడైయున్నాను’ అని యెహోవా చెప్పాడని గుర్తుంచుకోండి. వస్తుదాయకంగా మీకు కావలసినవి ఉంటాయో ఉండవో అని చింతిస్తున్నారా? ‘నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను’ అని యెహోవా చెప్పాడు.” (హెబ్రీయులు 13:5) శిష్యులను చేసే పనిలో తన నమ్మకమైన అనుచరులతో పాటు ఉంటానని యేసు వాగ్దానం చేశాడని విద్యార్థులకు గుర్తుచేస్తూ సహోదరుడు లూష్ తన ప్రసంగాన్ని ముగించారు.—మత్తయి 28:20.
“అగ్నివంటి పరీక్షలలో మీరు భద్రతను కనుగొంటారా?” అన్నది గిలియడ్ ఉపదేశకుడు లారెన్స్ బౌవెన్ ప్రసంగాంశం. ఏదెనులో లేవదీయబడిన వివాదాల వల్ల, యెహోవాకు అనితర భక్తిని చెల్లించాలని ఇష్టపడే వారందరూ కష్టాలను ఎదుర్కొంటున్నారనీ కొన్నిసార్లు అగ్నివంటి పరీక్షలను ఎదుర్కొంటున్నారనీ ఆయన చెప్పారు. యెహోవా అనుమతించిన అగ్నివంటి పరీక్షలను అంగీకరించడం ద్వారా, యెహోవాపై పూర్తిగా హెబ్రీయులు 5:8, 9) యెహోవాను బంగారం శుద్ధిచేసే వ్యక్తితో పోల్చవచ్చు, ఆ వ్యక్తి బంగారంలోని మలినాన్ని తీసివేయడానికి ఎంత వేడి అవసరమో సరిగ్గా అంతే ఉపయోగిస్తాడు. నిజమే, అగ్ని ద్వారా పరీక్షించబడిన విశ్వాసం శుద్ధిచేయబడిన బంగారం కంటే ఎంతో అధికంగా భద్రతనిస్తుంది. ఎందుకు? “ఎందుకంటే శుద్ధిచేయబడిన విశ్వాసం ఎంతటి ఒత్తిడినైనా సహించగలదు, మనం ‘అంతమువరకు సహించేందుకు’ అది మనల్ని సిద్ధపరుస్తుంది” అని సహోదరుడు బౌవెన్ చెప్పారు.—మత్తయి 24:13.
ఆధారపడడం ద్వారా నిజమైన భద్రతను కనుగొన్న యేసు యొక్క మాదిరిని అనుకరించమని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు—యెహోవా తన కుమారుని విధేయతను పరిపూర్ణం చేయడానికే ఆ అగ్నివంటి పరీక్షలను అనుమతించాడు. (మరో గిలియడ్ ఉపదేశకుడు మార్క్ న్యూమర్ ఇలా ప్రశ్నించారు: “మీరు ఇష్టపడదగిన వారిగా ఉంటారా?” సమూయేలును “యెహోవా దృష్టిలో మనుషుల దృష్టిలో ఇష్టపడదగినవాడు” అని వర్ణించిన 1 సమూయేలు 2:26, NW వచనంపై ఆధారపడిన అంశం గురించి ఆయన మాట్లాడారు. ఆఫ్రికాలో మిషనరీ సేవ చేస్తూ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడిపిన సహోదరుడు న్యూమర్, సమూయేలు ఉదాహరణను పరిశీలించిన తర్వాత ఇలా వ్యాఖ్యానించారు: “దేవుడు మీకు ఇచ్చిన పనికి విశ్వసనీయంగా హత్తుకుని ఉండడం ద్వారా మీరు కూడా దేవుని దృష్టిలో ఎంతో ఇష్టపడదగిన వారవ్వగలరు. ఆయన మీకు ఎంతో విలువైన మిషనరీ నియామకాన్నిచ్చాడు.” తమ నియామకాలను దేవుడు తమకు అప్పగించిన పరిశుద్ధ బాధ్యతలుగా దృష్టించమనీ తమ నియామకాలను నేరవేర్చడంలో దేవుని ఆలోచనా విధానాన్ని అనుసరించమనీ సహోదరుడు న్యూమర్ ఆ తరగతిలోని వారిని ప్రోత్సహించారు.
గిలియడ్ స్కూల్‌లో ఉండగా, వారాంతాల్లో ఆ ప్రాంతంలోని ప్రజలతో బైబిల్లోని “దేవుని గొప్పకార్యములను” పంచుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభించాయి. (అపొస్తలుల కార్యములు 2:11) నిజానికి, వారు ఆ విషయాల గురించి పది భాషలలో మాట్లాడగలిగారు. మరో గిలియడ్ ఉపదేశకుడైన వాల్లెస్ లివరెన్స్ “‘దేవుని గొప్ప కార్యములు’ ప్రజలను చర్య తీసుకొనేలా కదిలిస్తాయి” అన్న అంశం క్రింద కొంతమంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు, వారు తమ అనుభవాలను చెప్పారు. ఆయన ఇలా అన్నారు: “పెంతెకొస్తు రోజు మేడగదిలో ఉన్నవారు ‘దేవుని గొప్పకార్యముల’ గురించి మాట్లాడేలా ఆత్మ వారిని ప్రేరేపించింది. అదే ఆత్మ నేడు దేవుని నమ్మకమైన సేవకులందరి మీదా పనిచేస్తుంది.” ఇంకా అనేకమంది ప్రజలకు సాక్ష్యమివ్వాలనే ఉద్దేశంతో క్రొత్త భాషలను నేర్చుకునేందుకు కూడా కొంతమంది కదిలించబడ్డారు.
విషయాలను దేవుని దృక్కోణం నుండి చూసేందుకు ఆచరణాత్మకమైన సలహా
ప్రారంభపు ప్రసంగాలు ముగిసిన తర్వాత, అమెరికా బేతేలు కుటుంబ సభ్యులైన గ్యారీ బ్రొ, విలియమ్ యంగ్ ప్రస్తుతం మిషనరీలు సేవచేస్తున్న దేశాలకు చెందిన వివిధ బ్రాంచి కమిటీల సభ్యులను మరియు మిషనరీ సేవలో 41 సంవత్సరాలు గడిపిన ఒక వివాహిత జంటను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలలో చెప్పబడిన ఒక విషయం ఏమిటంటే: “అనేక వ్యక్తిగత సౌకర్యాలు కావాలని కోరుకోని మిషనరీలు ఎక్కువకాలం సేవచేస్తారు. తాము ఎందుకు వచ్చామన్న కారణంపై వారు తమ అవధానాన్ని నిలుపుతారు. తాము సువార్త ప్రకటించడానికీ యెహోవాను తెలుసుకునేందుకు ప్రజలకు సహాయం చేయడానికీ వచ్చామని వారికి తెలుసు.”
పరిపాలక సభలో మరో సభ్యుడైన డేవిడ్ స్‌ప్లేన్, “మీరు ఎంతో దూరం వెళ్ళడం లేదు!” అన్న అంశంగల ప్రసంగంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ తరగతికి చెందిన 46 మంది విద్యార్థులను భూవ్యాప్తంగా వివిధ దేశాలకు పంపిస్తున్నారన్న వాస్తవం దృష్ట్యా ఆయన మాటల భావమేమిటి? ఆయన ఇలా వివరించారు: “మీరు భూమ్మీద ఎక్కడ ఉన్నప్పటికీ, విశ్వసనీయంగా ఉన్నంతకాలం మీరు ఎల్లప్పుడూ దేవుని గృహంలోనే ఉంటారు.” అవును, విశ్వసనీయులైన క్రైస్తవులందరూ భౌతికంగా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలోని లేదా ఆయన గృహంలోని ఒక భాగంలో సేవచేస్తున్నారు. మొదటి శతాబ్దంలో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ గృహం ఉనికిలోకి వచ్చింది. (హెబ్రీయులు 9:9) భూమ్మీదున్న తన నమ్మకమైన సేవకులందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని తెలుసుకోవడం హాజరైనవారందరికి ఎంత ఓదార్పుకరం! యేసు భూమ్మీద ఉన్నప్పుడు యెహోవా ఆయనపై శ్రద్ధ కలిగివున్నట్లే, మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన గురించీ మనం తనకు చేసే సేవ గురించీ యెహోవా శ్రద్ధ కలిగివున్నాడు. కాబట్టి ఆరాధన విషయంలో, మనం ఒకరినుండి ఒకరం గానీ యేసు నుండి గానీ యెహోవా నుండి గానీ ఎన్నడూ దూరంగా ఉండము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలనుండి వచ్చిన అభినందనలను స్వీకరించిన తర్వాత, విద్యార్థుల నియామకాలను ప్రకటించిన తర్వాత, తాము గిలియడ్‌లో పొందిన శిక్షణకు మెప్పుదలతో తరగతిలోనివారు ఇచ్చిన ఉత్తరాన్ని చదివిన తర్వాత, అధ్యక్షుడు ప్రోత్సాహకరంగా కార్యక్రమాన్ని ముగించారు. తమ మంచి పనిని కొనసాగించమనీ యెహోవా సేవలో ఆనందించమనీ క్రొత్త మిషనరీలను ఆయన ప్రోత్సహించారు.—ఫిలిప్పీయులు 3:1.
[23వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంక వివరాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 14
నియమించబడిన దేశాల సంఖ్య: 19
విద్యార్థుల సంఖ్య: 46
సగటు వయస్సు: 35.0
సత్యంలో ఉన్న సగటు సంవత్సరాలు: 17.2
పూర్తికాల సేవలో ఉన్న సగటు సంవత్సరాలు: 13.7
[24వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 113వ తరగతి విద్యార్థులు
ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులోని వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలోను ఎడమవైపు నుండి కుడివైపుకు పేర్కొనబడ్డాయి.
(1) లైట్‌హార్ట్, ఎమ్.; హోసోయూ, ఎస్.; బెర్క్‌టోల్డ్, ఏ.; లీమ్, సి.; అయోకి, జె. (2) బాగీయాష్, జె.; బూకా, ఎస్.; బోస్సీ, ఏ.; ఆల్టన్, జె.; ఎస్కోబార్, ఐ.; ఎస్కోబార్, ఎఫ్. (3) స్టాయికా, ఏ.; స్టాయికా, డి.; ఫ్రీమత్, ఎస్.; కార్ల్‌సన్, ఎమ్.; లిబ్లాం, ఆర్. (4) బ్యాన్‌కీ, ఆర్.; బ్యాన్‌కీ, ఎస్.; కామిన్స్‌కీ, ఎల్.; జోసఫ్, ఎల్.; పారిస్, ఎస్.; లిబ్లాం, ఎల్. (5) పారిస్, ఎమ్.; స్కిడ్‌మోర్, బి.; హార్టన్, జె.; హార్టన్, ఎల్.; స్కిడ్‌మోర్, జి. (6) లీమ్, బి.; ఆల్టన్, జి.; క్విరీసీ, ఇ.; లాంగ్ల్వా, ఎమ్.; స్టైనింగర్, ఎస్.; అయోకి, హెచ్. (7) లాంగ్ల్వా, జె.; స్టైనింగర్, ఎమ్.; బోస్సీ, ఎఫ్.; కామిన్స్‌కీ, జె.; బూకా, జె.; లైట్‌హార్ట్, ఇ.; హొసోయి, కె. (8) బాగీయాష్, జె.; క్విరీసీ, ఎమ్.; కార్ల్‌సన్, ఎల్.; ఫ్రైమత్, సి.; బెర్క్‌టోల్డ్, డబ్ల్యూ.; జోసఫ్, ఆర్.