కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

యెహోవా ఉదారంగా ఇచ్చే దేవుడు. (యాకో. 1:17) నక్షత్రాలతో నిండిన విశాలమైన ఆకాశం మొదలుకొని భూమ్మీద తివాచీలా పరుచుకున్న పచ్చిక వరకు, యెహోవా చేసిన సృష్టంతా ఆయన ఉదారతను చాటిచెప్తుంది.—కీర్త. 65:12, 13; 147:7, 8; 148:3, 4.

సృష్టికర్త మీద ఉన్న కృతజ్ఞతతో కీర్తనకర్త, యెహోవా చేసిన అద్భుతమైన సృష్టిని స్తుతిస్తూ ఓ పాట రాశాడు. ఆయన రాసిన 104వ కీర్తన చదివి, యెహోవా గురించి మీరు కూడా అలాగే భావిస్తున్నారేమో పరిశీలించుకోండి. కీర్తనకర్త ఇలా అన్నాడు, “నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.” (కీర్త. 104:33) మీ కోరిక కూడా అదేనా?

ఉదారంగా ఇవ్వడంలో అత్యుత్తమ మాదిరి

తనలాగే మనం కూడా ఉదారంగా ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఎందుకు ఉదారంగా ఇవ్వాలో కూడా ఆయన మనకు చెప్తున్నాడు. దైవ ప్రేరేపణతో అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.”—1 తిమో. 6:17-19.

పౌలు కొరింథు సంఘానికి రెండవ పత్రిక రాసినప్పుడు, ఎలాంటి మనస్సుతో ఇవ్వాలో నొక్కిచెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరిం. 9:7) ఉదారంగా ఇవ్వడంవల్ల ఇతరుల అవసరాలు తీరతాయని, ఇచ్చేవాళ్లు కూడా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతారని పౌలు ఆ తర్వాత వివరించాడు.—2 కొరిం. 9:11-14.

దేవుని ఉదారతకు అత్యంత గొప్ప రుజువు గురించి పౌలు ఇలా అన్నాడు, “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.” (2 కొరిం. 9:15) యెహోవా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రజలకోసం చేస్తున్న మంచివన్నీ ఆ ‘వరములో’ భాగం అయ్యుండవచ్చు. ఆ “వరము” ఎంత గొప్పదంటే దాని విలువను మాటల్లో వర్ణించలేం.

యెహోవా, యేసుక్రీస్తు మనకోసం చేసినవాటన్నిటికి, చేయబోయేవాటన్నిటికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, సత్యారాధన కోసం మన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉదారంగా ఇవ్వడం. మనం ఇచ్చేది కొంచెమైనా లేదా ఎక్కువైనా ఉదారంగా ఇవ్వాలి.—1 దిన. 22:14; 29:3-5; లూకా 21:1-4.

[అధస్సూచీలు]

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్నవాళ్లు jwindiagift.org వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ రాబడి అంతటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.