కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

ప్రార్థన ముగింపులో “ఆమేన్‌” అని ఎందుకంటారు?

“ఆమేన్‌” అనేది హెబ్రీ భాషా పదం. దాన్ని గ్రీకు, తెలుగు భాషల్లో కూడా అలాగే ఉపయోగిస్తారు. సాధారణంగా ప్రార్థనను, ప్రమాణాన్ని, ఆశీర్వాదాన్ని లేదా శాపాన్ని విన్నవాళ్లంతా ఒకేసారి ఆమేన్‌ అంటారు. ప్రాథమికంగా దానికి “అవును గాక” లేదా “ఖచ్చితంగా” అనే అర్థాలున్నాయి. అలా అన్నప్పుడు, ప్రార్థిస్తున్న వ్యక్తి అడిగినవాటితో శ్రోతలు ఏకీభవిస్తున్నారని చూపిస్తుంది. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, “ఆమేన్‌ అనే పదం, ఖచ్చితత్వాన్ని, సత్యసంధతను, విశ్వసనీయతను, సంపూర్ణ నమ్మకాన్ని సూచిస్తుంది.” ధర్మశాస్త్రం ప్రకారం, బైబిలు కాలాల్లో ఒక వ్యక్తి ప్రమాణం లేదా నిబంధన చేసిన తర్వాత ఆమేన్‌ అన్నాడంటే ఆ వ్యక్తి తాను చేసిన ప్రమాణానికి లేదా నిబంధనకు కట్టుబడివుండాలి, దాని పర్యవసానాలకు బాధ్యత వహించాలి.—ద్వితీయోపదేశకాండము 27:15-26.

యేసు ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలను చెప్పిన తర్వాత ముగింపులో “ఆమేన్‌” అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన తాను చెప్పినవి ఎంత ఖచ్చితమైనవో చూపించడానికి ఆ పదాన్ని వాడాడు. ఆయన అలా చెప్పినప్పుడు ఉపయోగించిన గ్రీకు భాషాపదం తెలుగు బైబిల్లో “నిశ్చయముగా” అని అనువదించబడింది. (మత్తయి 5:18; 6:2, 5) యోహాను సువార్త అంతటిలో, యేసు “ఆమేన్‌” అనే గ్రీకు పదాన్ని వెంటవెంటనే రెండుసార్లు ఉపయోగించి తాను చెప్పినవాటి సత్యసంధతను, నమ్మకత్వాన్ని మరింత నొక్కి చెప్పాడు. యేసు ఆమేన్‌ అనే పదాన్ని ఈ విధంగా వెంటవెంటనే రెండుసార్లు ఉపయోగించడం, పరిశుద్ధ లేఖనాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పబడుతోంది.

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, యేసు సాక్ష్యం ‘నమ్మకమైనది, సత్యమైనది’ అని చెప్పడానికి ఆయన “ఆమేన్‌” అని పిలువబడ్డాడు.—ప్రకటన 3:14. (w09 6/1)

[13వ పేజీలోని చిత్రం]

“ఆమేన్‌,” ప్రకటన 3:14. కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌, సా.శ. 5వ శతాబ్దం