కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | సృష్టికర్తకు దగ్గరవ్వడం సాధ్యమే!

మీరు దేవుడు చెప్పింది చేస్తున్నారా?

మీరు దేవుడు చెప్పింది చేస్తున్నారా?

“నీకు ఏం కావాలన్నా ఒక్కమాట చెప్పు, వెంటనే చేసేస్తా” అని అస్సలు తెలియని వాళ్లతోనో కొంచెమే పరిచయం ఉన్న వాళ్లతోనో అంటారా? అనరు. అదే మీకిష్టమైన స్నేహితునితో అనడానికి మాత్రం ఆలోచించరు. ప్రాణస్నేహితులు సహజంగానే ఒకరి పనులు ఒకరు చేసుకుంటారు.

తన ఆరాధకులకు సంతోషాన్నిచ్చే పనులు యెహోవా ఎప్పుడూ చేస్తాడని బైబిలు చెబుతుంది. ఉదాహరణకు, దేవునితో మంచి స్నేహం ఉన్న దావీదు రాజు ఇలా అన్నాడు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి” (కీర్తన 40:5) అంతేకాదు, ఆయన గురించి తెలియని వాళ్లకు కూడా యెహోవా ‘ఆహారము అనుగ్రహిస్తూ, ఉల్లాసముతో హృదయములను నింపుతూ’ సంతోషపెడుతున్నాడు.—అపొస్తలుల కార్యములు 14:17.

మనం ప్రేమించి, గౌరవించే వాళ్లకోసం ప్రతీది సంతోషంగా చేస్తాం

అందరికీ సంతోషాన్నిచ్చే వాటిని చేయడం యెహోవాకు ఇష్టం. ఆయన స్నేహితులు కూడా ఆయన ‘హృదయాన్ని సంతోషపెట్టే’ వాటిని చేయాలని యెహోవా కోరుకోవడం సరైనదే కదా. (సామెతలు 27:11) మరి దేవున్ని సంతోషపెట్టడం కోసం మీరేమి చేయవచ్చు? బైబిలు ఇలా జవాబిస్తుంది: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి” అలా చేయడం దేవునికి ఇష్టం. (హెబ్రీయులు 13:16) అంటే, యెహోవాను సంతోషపెట్టడానికి మంచి చేస్తూ, మనకున్నది ఇతరులతో పంచుకుంటే సరిపోతుందా?

“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని బైబిల్లో ఉంది. (హెబ్రీయులు 11:6) ‘దేవుని నమ్మిన’ తర్వాతే అబ్రాహాముకు ‘దేవుని స్నేహితుడని పేరు కలిగింది’ అని గుర్తుంచుకోండి. (యాకోబు 2:23) దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ‘దేవునియందు విశ్వాసముంచాలి’ అని యేసుక్రీస్తు కూడా చెప్పాడు. (యోహాను 14:1) దేవుడు తన స్నేహితుల నుండి కోరుకుంటున్న విశ్వాసాన్ని మీరెలా సంపాదించవచ్చు? మీరు ప్రతీరోజు దేవుని వాక్యమైన బైబిలును చదివి అర్థంచేసుకోవడం మొదలు పెట్టవచ్చు. అలా చేస్తూ “ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించి,” ‘అన్ని విషయాల్లో ఆయనను సంతోషపెట్టడం’ ఎలాగో నేర్చుకుంటారు. యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటూ, ఆయన నీతి-నియమాలను పాటించినప్పుడు మీ విశ్వాసం పెరిగి ఆయనతో మీ స్నేహం ఇంకా బలపడుతుంది.—కొలొస్సయులు 1:9-12. (w14-E 12/01)