కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీతో మాట్లాడవచ్చా?

దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది? (2వ భాగం)

దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది? (2వ భాగం)

యెహోవాసాక్షులకు, పొరుగువాళ్లకు సాధారణంగా జరిగే చర్చను ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అశోక్‌ అనే యెహోవాసాక్షి కిషోర్‌ ఇంటికి మళ్లీ వెళ్లాడని అనుకుందాం.

నెబుకద్నెజరు కల గురించి మళ్లీ ఒకసారి చూద్దాం

అశోక్‌: కిషోర్‌ గారు మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉంది. మీతో బైబిలు విషయాలు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంటుంది. a ఎలా ఉన్నారు?

కిషోర్‌: బావున్నానండి. థాంక్స్‌.

అశోక్‌: సంతోషం అండి. దేవుని రాజ్య పరిపాలన 1914లో మొదలైందని యెహోవాసాక్షులు ఎందుకు నమ్ముతారు అనే విషయం గురించి మనం పోయినసారి మాట్లాడుకున్నాం కదా. b బైబిల్లో ఉన్న దానియేలు పుస్తకం 4వ అధ్యాయంలో అందుకు రుజువును చూశాం. అక్కడ ఏముందో మీకు గుర్తుందా?

కిషోర్‌: ఒక పెద్ద చెట్టు గురించి నెబుకద్నెజరుకు వచ్చిన కల గురించి ఉంది.

అశోక్‌: కరెక్ట్‌. కలలో నెబుకద్నెజరు ఆకాశం అంత ఎత్తున్న ఒక పెద్ద చెట్టును చూశాడు. ఒక దేవదూత ఆ చెట్టును నరికివేయమని దాని వేర్లను, మొదలును నరికివేయకుండా విడిచిపెట్టమని చెప్పడం విన్నాడు. “ఏడుకాలముల” తర్వాత ఆ చెట్టు మళ్లీ పెరుగుతుంది. c ఆ ప్రవచనం ఎలా రెండు విధాలుగా నెరవేరిందో కూడా చూశాం. మొదట ఎలా నెరవేరిందో మీకు గుర్తుందా?

కిషోర్‌: గుర్తుంది. మొదటిది నెబుకద్నెజరుకు జరిగింది, ఏడు సంవత్సరాలు ఆయన పిచ్చి వాడయ్యాడు.

అశోక్‌: అవును. కొంతకాలం ఆయనకు పిచ్చి పట్టింది. దాని వల్ల ఆ ఏడేళ్లు ఆయన పరిపాలన కూడా ఆగిపోయింది. అయితే రెండవ నెరవేర్పు దేవుని పరిపాలన “ఏడు కాలములు” ఆగిపోవడం గురించి. ఆ ఏడు కాలములు సా.శ.పూ. 607⁠లో యెరూషలేము నాశనంతో మొదలయ్యాయని తెలుసుకున్నాం. అప్పటి నుండి యెహోవా దేవుని తరఫున ఆయన ప్రజల్ని ఏ రాజూ పరిపాలించలేదు. అయితే ఏడుకాలములు ముగిసిన తర్వాత దేవుడు తన ప్రజల మీద రాజుగా పరలోకంలో ఒక కొత్త పరిపాలకున్ని నియమిస్తాడు. అంటే దేవుని పరలోక రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలంటే ఏడుకాలములు ఎప్పుడు ముగిశాయో తెలుసుకోవాలి. అవి ఎప్పుడు మొదలయ్యాయో మనం చూసేశాం. ఇక మనం అవి ఎంత కాలం ఉంటాయన్నది తెలుసుకోవాలి. అర్థమైంది కదండి.

కిషోర్‌: అర్థమైంది. మనం మాట్లాడుకున్నదంతా చక్కగా గుర్తు చేశారు. థాంక్స్‌.

అశోక్‌: ఇప్పుడు కొంచెం ఎక్కువ తెలుసుకుందాం. ఆ “ఏడు కాలములు” అంటే ఎంత అన్నది తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకుందామని నేను ఇందాకే దీని గురించి చదివి వచ్చాను. వీలైనంత చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

కిషోర్‌: సరే.

ఏడు కాలములు ముగిశాయి—చివరి రోజులు మొదలయ్యాయి

అశోక్‌: ఈ ప్రవచనం మొదట నెబుకద్నెజరు విషయంలో నెరవేరినప్పుడు ఏడు కాలములు అంటే ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు. కానీ ఆ ప్రవచనం దేవుని రాజ్యం గురించి చెబుతున్నప్పుడు ఏడు కాలములు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం.

కిషోర్‌: ఎందుకలా చెప్పవచ్చు?

అశోక్‌: ఏడు కాలములు సా.శ.పూ. 607⁠లో మొదలయ్యాయి కదా. అప్పటి నుండి లెక్కపెడితే ఏడు సంవత్సరాలు సా.శ.పూ. 600⁠లో ముగుస్తాయి. అయితే దేవుని పరిపాలన మొదలైంది అని చెప్పే సంఘటనలేవీ ఆ సంవత్సరంలో జరగలేదు. అంతేకాదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆ ఏడు కాలములు ఇంకా పూర్తవలేదు అని కూడా చెప్పాడని మనం చూశాం గుర్తుందా.

కిషోర్‌: ఆ! అవును. గుర్తుకు వచ్చింది.

అశోక్‌: కాబట్టి ఆ ఏడు కాలములంటే ఏడు సంవత్సరాలు కాదుగానీ ఇంకా ఎక్కువే అయ్యుండాలి.

కిషోర్‌: ఎంతకాలం అయ్యుండచ్చు?

అశోక్‌: దానియేలు పుస్తకంతో సంబంధం ఉన్న ప్రకటన పుస్తకం ఆ ఏడు కాలములంటే ఎంత సమయమో తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రకటన పుస్తకంలో మూడున్నర కాలములు అంటే 1260 రోజులు అని ఉంది. d దీన్నిబట్టి ఏడు కాలములు అంటే మూడున్నర కాలములకు రెట్టింపు అంటే 2520 రోజులు. అర్థమైంది కదా.

కిషోర్‌: అర్థమైంది. కానీ దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైందో దీని నుండి ఎలా తెలుసుకోవచ్చు?

అశోక్‌: చూద్దాం. బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఒక సంవత్సరాన్ని ఒక రోజుగా చెప్తాయి. e ఒక రోజు ఒక సంవత్సరం అని లెక్కపెడితే ఈ ఏడు కాలములు 2520 సంవత్సరాలు అవుతాయి. సా.శ.పూ. 607 నుండి 2520 సంవత్సరాలు లెక్కపెడితే 1914⁠లో పూర్తవుతాయి. f అలా ఏడు కాలములు 1914⁠లో పూర్తయ్యాయని, దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలన మొదలైందని తెలుసుకుంటాం. అంతేకాదు అంత్య దినాల్లో ప్రపంచమంతా జరిగే సంఘటనల గురించి కూడా బైబిలు చెప్పింది. మనం గమనిస్తే ఆ సంఘటనలు 1914 నుండి జరుగుతున్నాయి.

కిషోర్‌: ఏ సంఘటనలు?

అశోక్‌: మత్తయి 24:7, 8⁠లో యేసు ఏమి చెప్పాడో చూడండి. పరలోకంలో తను పరిపాలించే సమయం గురించి అక్కడ యేసు ఇలా చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును.” ఆ సమయంలో కరవులు, భూకంపాలు వస్తాయని యేసు చెప్పడం గమనించారా? గడిచిన వందేళ్లలో ప్రపంచంలో అలాంటివి ఎన్నో జరిగాయి. కాదంటారా?

కిషోర్‌: నిజమే.

అశోక్‌: ఈ వచనంలో తాను రాజైనప్పుడు భూమ్మీద జరిగే యుద్ధాల గురించి కూడా యేసు చెప్పాడు. ప్రకటన పుస్తకం చిన్నాచితకా యుద్ధాల గురించి చెప్పడం లేదు కానీ మొత్తం ప్రపంచాన్నే కుదిపేసే యుద్ధాల గురించి చెబుతోంది. g మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైందో మీకు గుర్తుందా?

కిషోర్‌: గుర్తుంది, 1914⁠లో. యేసు పరిపాలించడం మొదలైందని మీరంటున్నది కూడా ఆ సంవత్సరంలోనే కదా. ఈ రెండిటికీ సంబంధం ఉందని నేనెప్పుడూ అనుకోలేదు.

అశోక్‌: ఏడు కాలములు గురించిన ప్రవచనం, అంత్యదినాలకు సంబంధించిన ఇతర బైబిలు ప్రవచనాలు అన్నీ కలిపి ఆలోచించినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. దేవుని రాజ్యానికి రాజుగా యేసు 1914⁠లో పరిపాలన మొదలు పెట్టాడని, అదే సంవత్సరం అంత్యదినాలు మొదలయ్యాయని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. h

కిషోర్‌: పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది.

అశోక్‌: నిజమే, ముందే చెప్పినట్లు పూర్తిగా అర్థం చేసుకోవడం నాకూ కష్టంగానే అనిపించింది. అయితే 1914 అని బైబిల్లో సూటిగా లేకపోయినా, బైబిల్లో ఉన్న వచనాల ఆధారంగానే యెహోవాసాక్షులు దీన్ని నమ్ముతున్నారని మీరు అర్థంచేసుకునే ఉంటారు.

కిషోర్‌: మీలో నాకు నచ్చేది అదే. ఏది చెప్పినా, బైబిలు వచనాలతోనే చెప్తారు. మీ సొంత అభిప్రాయాల్ని ఎప్పుడూ చెప్పరు. అయితే ఇంత కష్టపడడం ఎందుకు? పరలోకంలో యేసు పరిపాలన మొదలయ్యేది 1914⁠లోనే అని దేవుడు బైబిల్లో సూటిగా రాయించవచ్చు కదా.

అశోక్‌: మంచి ప్రశ్న కిషోర్‌ గారు. నిజానికి, బైబిలు చాలా విషయాల్ని సూటిగా చెప్పడం లేదు. మరి దేవుడు బైబిల్ని కష్టపడి చదివి అర్థంచేసుకునేలాఎందుకు రాయించాడు? వచ్చే వారం ఈ ప్రశ్న గురించి మాట్లాడుకుందామా?

కిషోర్‌: తప్పకుండా. ▪ (w14-E 11/01)

మీకు అర్థం కాని బైబిలు విషయాలు ఏమైనా ఉన్నాయా? యెహోవాసాక్షుల నమ్మకాల గురించి గానీ పద్ధతుల గురించి గానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యెహోవాసాక్షులతో మాట్లాడండి. వాళ్లు మీకు సంతోషంగా వివరిస్తారు.

a యెహోవా సాక్షులు పొరుగువాళ్లతో బైబిలు గురించిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం చర్చిస్తుంటారు.

b జనవరి-మార్చి 2015 కావలికోట పత్రికలో వచ్చిన “మీతో మాట్లాడవచ్చా?—దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది?—1వ భాగం” అనే ఆర్టికల్‌ చూడండి.

d ప్రకటన 12:6, 14 చూడండి.

f “పెద్ద చెట్టు గురించి నెబుకద్నెజరుకు వచ్చిన కల” చార్టు చూడండి.

g ప్రకటన 6:4 చూడండి.

h యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 9వ అధ్యాయం చూడండి. www.mt1130.com/te వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకం చూడొచ్చు.