కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమర్పణ

సమర్పణ

మనం ఏ ఉద్దేశంతో యెహోవా దేవునికి సమర్పించుకోవాలి?

మనం దేవున్ని సేవించాలనుకుంటే బైబిల్ని ఎలా చూడాలి?

మనల్ని పాపం నుండి విడిపించడానికి దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడు, దాన్ని మనం ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచాలి?

గతంలో చేసిన చెడ్డ పనుల విషయంలో పశ్చాత్తాపపడడం అంటే ఏంటి?

అపొ 3:19; 26:20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 19:1-10—పన్ను వసూలు చేసే ముఖ్య అధికారి జక్కయ్య, తాను అన్యాయంగా చేసిన పనుల విషయంలో పశ్చాత్తాపపడి ప్రజల దగ్గర లాక్కున్న వాటిని తిరిగి ఇచ్చేశాడు

    • 1తి 1:12-16—అపొస్తలుడైన పౌలు గతంలో చేసిన పాపాలన్నీ ఎలా విడిచిపెట్టాడో అలాగే యెహోవా, యేసు తన మీద కరుణ చూపించడం వల్ల ఎలా క్షమాపణ పొందాడో చెప్పాడు

చెడ్డ పనులు మానేయడంతో పాటు మనం ఇంకా ఏం చేయాలి?

మనం దేవునికి ఇష్టమైన విధంగా సేవించాలంటే ఎలాంటి బైబిలు ప్రమాణాల్ని పాటించాలి?

1కొ 6:9-11; కొలొ 3:5-9; 1పే 1:14, 15; 4:3, 4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1కొ 5:1-13—ఘోరమైన లైంగిక పాపం చేసిన ఒక వ్యక్తిని వెలివేయాలని అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి చెప్పాడు

    • 2తి 2:16-19—కొరుకుడు పుండులా వ్యాపించే మతభ్రష్ట బోధలకు దూరంగా ఉండమని అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించాడు

మనం లోక ప్రభుత్వాలకు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు?

యెష 2:3, 4; యోహా 15:19

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోహా 6:10-15—యేసు అద్భుత రీతిలో చాలామందికి ఆహారం పెట్టినప్పుడు, ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు కానీ యేసు అక్కడి నుండి వెళ్లిపోయాడు

    • యోహా 18:33-36—తన రాజ్యానికి ఈ లోక రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని యేసు చెప్పాడు

దేవున్ని సేవించడానికి మనకు పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది?

యోహా 16:13; గల 5:22, 23

అపొ 20:28; ఎఫె 5:18 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 15:28, 29—సున్నతి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి యెరూషలేములో ఉన్న పరిపాలక సభకు పవిత్రశక్తి సహాయం చేసింది

మనం దేవునికి సమర్పించుకున్న తర్వాత యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని ఎలా సేవ చేయాలి?

దేవునికి సమర్పించుకున్న క్రైస్తవులు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి?

మత్త 28:19, 20; అపొ 2:40, 41; 8:12; 1పే 3:21

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 3:13-17—యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి వచ్చానని చూపించాడు

    • అపొ 8:26-39—అప్పటికే యెహోవాను ఆరాధిస్తున్న ఇతియోపియుడైన అధికారి యేసు గురించిన మంచివార్త విని బాప్తిస్మం తీసుకోవాలని అనుకున్నాడు