కీర్తనలు 32:1-11

  • క్షమాపణ పొందినవాళ్లు సంతోషంగా ఉంటారు

    • “నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను” (5)

    • దేవుడు నీకు లోతైన అవగాహనను ఇస్తాడు (8)

దావీదు కీర్తన. మాస్కిల్‌.* 32  తన అపరాధం, పాపం క్షమించబడిన* వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+   యెహోవా అపరాధిగా ఎంచని వ్యక్తి, మనసులో కపటంలేని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+   నేను మౌనంగా ఉన్నప్పుడు, రోజంతా నా మూల్గుల వల్ల నా ఎముకలు క్షీణించాయి.+   ఎందుకంటే, రాత్రింబగళ్లు నీ చెయ్యి నా మీద భారంగా ఉంది.+ వేసవికాలం వేడికి నీళ్లు ఆవిరైనట్టు నా శక్తి ఆవిరైపోయింది.* (సెలా)   చివరికి నేను, నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను;నా తప్పును దాచిపెట్టలేదు.+ “నా అపరాధాల్ని యెహోవా దగ్గర ఒప్పుకుంటాను” అని అనుకున్నాను.+ నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు.+ (సెలా)   అందుకే నిన్ను సమీపించే అవకాశం ఉన్నప్పుడే+విశ్వసనీయులైన ప్రతీ ఒక్కరు నీకు ప్రార్థిస్తారు.+ అప్పుడు వరద నీళ్లు కూడా వాళ్ల దగ్గరికి రావు.   నేను దాక్కునే స్థలం నువ్వు;నువ్వు నన్ను కష్టాల నుండి కాపాడతావు.+ నా చుట్టూ విడుదల సంబరాలు ఉండేలా చేస్తావు.+ (సెలా)   నువ్వు ఇలా అన్నావు: “నేను నీకు లోతైన అవగాహనను ఇస్తాను, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాను.+ నీ మీద దృష్టి ఉంచి నీకు సలహా చెప్తాను.+   అవగాహన లేని గుర్రంలా, కంచర గాడిదలా అవ్వకు,+అవి నీ దగ్గరికి రావాలంటేముందుగా వాటిని కళ్లెంతో గానీ తాడుతో గానీ అదుపు చేయాలి.” 10  దుష్టులకు ఎన్నో వేదనలు;కానీ యెహోవా మీద నమ్మకముంచేవాళ్లకు ఆయన విశ్వసనీయ ప్రేమ తోడుంటుంది.+ 11  నీతిమంతులారా, యెహోవాను బట్టి ఉల్లసించండి, ఆనందించండి;నిజాయితీగల హృదయం ఉన్నవాళ్లారా, మీరందరూ ఆనందంతో కేకలు వేయండి.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “కప్పబడిన.”
లేదా “నా సారం ఎండిపోయింది.”