మీకా 1:1-16
1 యోతాము,+ ఆహాజు,+ హిజ్కియా+ అనే యూదా రాజుల కాలంలో+ మోరష్తీకి చెందిన మీకా* దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం;+ అతను సమరయ గురించి, యెరూషలేము గురించి ఈ దర్శనం చూశాడు:
2 “సమస్త దేశాల ప్రజలారా, వినండి!
భూమీ, అందులోని సమస్తమా, జాగ్రత్తగా ఆలకించండి,సర్వోన్నత ప్రభువైన యెహోవా,తన పవిత్ర ఆలయంలో ఉన్న యెహోవా
మీ మీద సాక్షిగా ఉండాలి.+
3 ఇదిగో! యెహోవా తన నివాస స్థలం నుండి బయల్దేరుతున్నాడు;ఆయన కిందికి దిగివచ్చి భూమి ఎత్తైన స్థలాల మీద నడుస్తాడు.
4 అగ్నికి మైనం కరిగినట్టు,ఏటవాలు చోటు నుండి నీళ్లు కిందికి జారినట్టు,ఆయన కాళ్ల కింద పర్వతాలు కరిగిపోతాయి,+లోయలు చీలిపోతాయి.
5 ఇదంతా యాకోబు తిరుగుబాటు వల్లే,
ఇశ్రాయేలు ఇంటివాళ్ల పాపాల వల్లే.+యాకోబు తిరుగుబాటుకు కారణం ఎవరు?
సమరయ కాదా?+
యూదా ఉన్నత స్థలాలకు బాధ్యులు ఎవరు?+
యెరూషలేము కాదా?
6 నేను సమరయను మైదానంలోని శిథిలాల కుప్పగా,ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను;దాని రాళ్లను లోయలో పారేస్తాను,*దాని పునాదులు బయటికి కనిపించేలా చేస్తాను.
7 దాని చెక్కుడు విగ్రహాలన్నీ ముక్కలుముక్కలుగా పగలగొట్టబడతాయి,+వేశ్యగా ఆమె సంపాదించిన కానుకలన్నీ అగ్నిలో కాల్చేయబడతాయి.+
ఆమె విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను.
వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బుతో ఆమె వాటిని పోగుచేసుకుంది,అవి మళ్లీ వేశ్యలకు జీతం అవుతాయి.”
8 అందుకే నేను ఏడుస్తాను, రోదిస్తాను;+వట్టి కాళ్లతో, దిగంబరంగా నడుస్తాను.+
నా ఏడ్పు నక్కల ఊలలా ఉంటుంది,నా మూలుగు నిప్పుకోళ్ల మూలుగులా ఉంటుంది.
9 ఆమె గాయం మాననిది;+అది యూదాకు కూడా తగిలింది.+
ఆ తెగులు నా ప్రజల నగర ద్వారమైన యెరూషలేము వరకు వ్యాపించింది.+
10 “దాని గురించి గాతులో ప్రకటించకండి;అస్సలు ఏడ్వకండి.
బేత్-అఫ్రలో* మట్టిలో పడి దొర్లండి.
11 షాఫీరు నివాసులారా,* దిగంబరులై సిగ్గుపడుతూ వెళ్లిపోండి.
జయనాను నివాసులు* బయల్దేరలేదు.
బేతేజెలులో ఏడ్పు వినిపిస్తుంది, అది ఇక మీకు మద్దతు ఇవ్వదు.
12 మారోతు నివాసులు* మంచి జరుగుతుందని ఎదురుచూశారు,కానీ యెహోవా నుండి యెరూషలేము ద్వారం దగ్గరికి ఆపద వచ్చింది.
13 లాకీషు+ నివాసులారా,* రథానికి గుర్రాలు కట్టండి.
సీయోను కూతురి పాపానికి కారణం మీరే,ఎందుకంటే, ఇశ్రాయేలు తిరుగుబాట్లు మీలో కనిపించాయి.+
14 మీరు మోరెషెత్-గాతుకు వీడ్కోలు కానుకలు ఇస్తారు.
అక్జీబు+ ఇళ్లు ఇశ్రాయేలు రాజుల్ని మోసం చేశాయి.
15 మారేషా+ నివాసులారా,* విజేతను* నేను మీ దగ్గరికి తీసుకొస్తాను.+
ఇశ్రాయేలు మహిమ అదుల్లాము+ వరకు వ్యాపిస్తుంది.
16 మీ ప్రియమైన పిల్లల కోసం మీ వెంట్రుకల్ని గొరిగించుకొని తలల్ని బోడి చేసుకోండి.మీ తలల్ని గద్దలా బోడి చేసుకోండి.
ఎందుకంటే వాళ్లను మీ దగ్గర నుండి బందీలుగా తీసుకెళ్లారు.”+
అధస్సూచీలు
^ ఇది మిఖాయేలు (“దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం) లేదా మీకాయా (“యెహోవా వంటి వాడు ఎవడు?” అని అర్థం) అనే పేర్లకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “కుమ్మరిస్తాను.”
^ లేదా “అఫ్ర ఇంటిలో.”
^ అక్ష., “నివాసురాలా.”
^ అక్ష., “నివాసురాలు.”
^ అక్ష., “నివాసురాలు.”
^ అక్ష., “నివాసురాలా.”
^ అక్ష., “నివాసురాలా.”
^ లేదా “ఆక్రమించేవాణ్ణి.”