మీకా 3:1-12

  • నాయకుల్ని, ప్రవక్తల్ని ఖండించడం (1-12)

    • యెహోవా పవిత్రశక్తివల్ల మీకా బలం పొందడం (8)

    • యాజకులు డబ్బు కోసం బోధిస్తున్నారు (11)

    • యెరూషలేము శిథిలాల కుప్పలుగా అవుతుంది (12)

3  నేను ఇలా అన్నాను: “యాకోబు పెద్దలారా,ఇశ్రాయేలు ఇంటి అధిపతులారా, దయచేసి వినండి.+ మీకు న్యాయం తెలిసుండాలి కదా?   కానీ మీరు మంచిని అసహ్యించుకుంటూ,+ చెడును ప్రేమిస్తున్నారు;+నా ప్రజల చర్మాన్ని ఒలిచేసి, వాళ్ల ఎముకల మీది మాంసాన్ని చీల్చేస్తున్నారు.+   అంతేకాదు, మీరు నా ప్రజల మాంసాన్ని తింటున్నారు;+వాళ్ల చర్మాన్ని ఒలిచేస్తున్నారు,వాళ్ల ఎముకల్ని నలగ్గొట్టి,వంటపాత్రలో* వండిన మాంసంలా వాటిని ముక్కలుముక్కలు చేస్తున్నారు.+   ఆ సమయంలో వాళ్లు సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తారు,కానీ ఆయన వాళ్లకు జవాబివ్వడు. వాళ్ల చెడ్డపనుల్ని బట్టి,+ఆ సమయంలో ఆయన వాళ్లకు కనిపించకుండా తన ముఖాన్ని తిప్పుకుంటాడు.+   నా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ,తినడానికి ఏమైనా ఇచ్చినప్పుడు,*+ ‘శాంతి!’ అని అంటూ,+తమ నోట్లో ఏమీ పెట్టనివాళ్ల మీద యుద్ధం ప్రకటించే ప్రవక్తలకు వ్యతిరేకంగా+ యెహోవా ఇలా చెప్తున్నాడు:   ‘మీకు రాత్రి ఉంటుంది;+ దర్శనం కలగదు;+మీకు చీకటి మాత్రమే ఉంటుంది, మీరు సోదె చెప్పరు. ప్రవక్తల మీద సూర్యుడు అస్తమిస్తాడు,వాళ్లకు పగలు చీకటిగా మారుతుంది.+   దర్శనాలు చూసేవాళ్లు అవమానించబడతారు,+సోదె చెప్పేవాళ్లు నిరాశపడతారు. దేవుని నుండి ఏ జవాబూ రాదు కాబట్టివాళ్లంతా తమ నోటిని* కప్పుకోవాల్సి వస్తుంది.’ ”   నా విషయానికొస్తే, యాకోబుకు తన తిరుగుబాటు గురించి, ఇశ్రాయేలుకు తన పాపం గురించి చెప్పడానికి,యెహోవా పవిత్రశక్తి నాలో బలాన్ని,న్యాయాన్ని, ధైర్యాన్ని నింపింది.   యాకోబు ఇంటి పెద్దలారా,ఇశ్రాయేలు ఇంటి అధిపతులారా, దయచేసి ఇది వినండి.+మీరు న్యాయాన్ని అసహ్యించుకుంటున్నారు, తిన్నగా ఉన్నవాటన్నిటినీ వంకరగా మారుస్తున్నారు,+ 10  మీరు సీయోనును రక్తపాతంతో, యెరూషలేమును అవినీతితో కడుతున్నారు.+ 11  దాని నాయకులు లంచం తీసుకుని తీర్పుతీరుస్తున్నారు,+యాజకులు డబ్బుల కోసం బోధిస్తున్నారు,+ప్రవక్తలు వెండి* కోసం సోదె చెప్తున్నారు.+ అయినా వాళ్లు యెహోవా మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటూ, “యెహోవా మనకు తోడుగా లేడా?+ మన మీదికి ఏ విపత్తూ రాదు” అని అంటున్నారు.+ 12  కాబట్టి మీ వల్లే,సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది,యెరూషలేము శిథిలాల కుప్పల్లా మారుతుంది,+మందిర* పర్వతం అడవిలోని ఎత్తైన స్థలాల్లా అవుతుంది.+

అధస్సూచీలు

లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్రలో.”
లేదా “నమలడానికి ఏదైనా ఉన్నప్పుడు” అయ్యుంటుంది.
లేదా “మీసాన్ని.”
లేదా “డబ్బు.”
లేదా “ఆలయ.”