యెషయా 28:1-29
28 ఎఫ్రాయిము+ తాగుబోతుల ఆడంబరమైన* కిరీటానికి* శ్రమ!వాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యానికి శ్రమ!అది, ద్రాక్షారసం మత్తులో ఉన్నవాళ్లు నివసించే సారవంతమైన లోయ తలమీద ఉంది.
2 ఇదిగో! శక్తిమంతుడూ బలవంతుడూ అయిన ఒక వ్యక్తి యెహోవాకు ఉన్నాడు.
ఉరిమే వడగండ్ల వానలా, నాశనకరమైన గాలివానలా,శక్తివంతమైన ప్రవాహాలతో కూడిన ఉరుముల తుఫానులాఆయన దాన్ని బలంగా భూమ్మీదికి విసిరేస్తాడు.
3 ఎఫ్రాయిము తాగుబోతుల ఆడంబరమైన* కిరీటాలుకాళ్ల కింద తొక్కబడతాయి.+
4 సారవంతమైన లోయ తలమీద ఉన్నవాడిపోతున్న పువ్వు లాంటి దాని మహిమాన్విత సౌందర్యంవేసవికాలం రాకముందే కాసిన తొలి అంజూర పండులా ఉంటుంది.
ఎవరైనా దాన్ని చూస్తే, వెంటనే దాన్ని తెంపి మింగేస్తారు.
5 ఆ రోజు సైన్యాలకు అధిపతైన యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లకు+ మహిమాన్విత కిరీటం, అందమైన పూలదండ అవుతాడు.
6 న్యాయం తీర్చడానికి కూర్చున్నవాళ్లకు న్యాయం గురించిన అవగాహనను, నగర ద్వారం దగ్గర దాడిని ఎదిరించేవాళ్లకు బలాన్ని ఇస్తాడు.+
7 వీళ్లు కూడా ద్రాక్షారసం వల్ల పక్కదారి పడుతున్నారు;వాళ్ల మత్తుపానీయాలు వాళ్లను తూలేలా చేస్తున్నాయి.
మద్యం వల్ల యాజకుడు, ప్రవక్త తప్పుదారి పడుతున్నారు;ద్రాక్షారసం వాళ్లను అయోమయంలో పడేస్తోంది,మద్యం తాగి వాళ్లు తూలుతున్నారు;వాళ్ల దర్శనం వాళ్లను పక్కదారి పట్టిస్తోంది,న్యాయం తీర్చే విషయంలో వాళ్లు తడబడుతున్నారు.+
8 వాళ్ల బల్లలు అసహ్యమైన వాంతితో నిండిపోయాయి,అది లేని చోటంటూ లేదు.
9 ఎవరికి జ్ఞానం నేర్పిస్తారు?ఎవరికి సందేశాన్ని వివరిస్తారు?
అప్పుడే పాలు మానేసిన వాళ్లకా?అప్పుడే చన్ను విడిచిన వాళ్లకా?
10 ఎందుకంటే అతని మాటలు వాళ్లకు, “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ” అన్నట్టు ఉన్నాయి.
11 కాబట్టి ఆయన ఈ ప్రజలతో నత్తివాళ్ల ద్వారా మాట్లాడతాడు, విదేశీ భాషలో మాట్లాడతాడు.+
12 ఆయన ఒకసారి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇదే విశ్రాంతి స్థలం. అలసిపోయిన వ్యక్తిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇదే సేదదీరే చోటు.” కానీ వాళ్లు వినలేదు.+
13 కాబట్టి వాళ్ల విషయంలో యెహోవా మాట ఏమిటంటే:
“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,నియమం వెంట నియమం, నియమం వెంట నియమం,*+కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ.”
దానివల్ల, వాళ్లు నడుస్తున్నప్పుడుతడబడి, వెనక్కి పడిపోయి,గాయపడి, ఉచ్చులో చిక్కుకొని, పట్టబడతారు.+
14 కాబట్టి యెరూషలేములోని ఈ ప్రజల పరిపాలకులారా,గొప్పలు చెప్పుకుంటున్న మీరంతా యెహోవా మాట వినండి.
15 మీరు ఇలా చెప్పుకుంటున్నారు:
“మేము మరణంతో ఒప్పందం చేసుకున్నాం,+సమాధితో* ఒడంబడిక చేసుకున్నాం.*
అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లేటప్పుడుఅది మా దాకా రాదు;ఎందుకంటే మేము అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నాం,మోసం కింద దాక్కున్నాం.”+
16 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“ఇదిగో, నేను పరీక్షించబడిన ఒక రాయిని సీయోనులో పునాదిగా వేస్తాను,+సుస్థిరమైన పునాదికి+ అది అమూల్యమైన మూలరాయి.+
దానిమీద విశ్వాసం చూపించే వాళ్లెవరూ కంగారుపడరు.+
17 నేను న్యాయాన్ని కొలనూలుగా,+నీతిని లంబసూత్రంగా* చేస్తాను.+
వడగండ్లు అబద్ధాల ఆశ్రయాన్ని తుడిచిపెట్టేస్తాయి,దాక్కునే చోటు నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోతుంది.
18 మరణంతో మీరు చేసుకున్న ఒప్పందం రద్దౌతుంది,సమాధితో* మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు.+
అకస్మాత్తుగా ప్రచండమైన ప్రవాహం దాటివెళ్లినప్పుడుదానివల్ల మీరు చితికిపోతారు.
19 అది దాటివెళ్లిన ప్రతీసారిమిమ్మల్ని ఊడ్చేస్తుంది;+ఎందుకంటే, ప్రతీ ఉదయం అది దాటివెళ్తుంది,పగలూ రాత్రీ ప్రవహిస్తుంది.
విపరీతమైన భయం వల్ల మాత్రమే వాళ్లు తాము విన్నదాన్ని గ్రహిస్తారు.”*
20 చాచుకొని పడుకోవడానికి పరుపు పొడవు సరిపోదు,చుట్టుకొని పడుకోవడానికి దుప్పటి వెడల్పు సరిపోదు.
21 ఎందుకంటే యెహోవా పెరాజీము కొండ మీద లేచినట్టు లేస్తాడు;గిబియోను దగ్గరున్న లోయలో రేపుకున్నట్టు తనను తాను రేపుకుంటాడు,+తన కార్యాన్ని, అంటే తన వింతైన కార్యాన్ని చేయడానికితన పనిని, అంటే అసాధారణమైన తన పనిని నెరవేర్చడానికి+ అలా లేస్తాడు.
22 కాబట్టి మీ కట్లు ఇంకా గట్టిగా బిగించబడకుండా ఉండేలాఅపహాస్యం చేయకండి,+ఎందుకంటే దేశమంతా* సమూలంగా నాశనమవ్వాలని నిర్ణయించబడినట్టు+నేను సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా దగ్గర విన్నాను.
23 నేను చెప్పేది చెవిపెట్టి వినండి;నా మాటలు శ్రద్ధగా ఆలకించండి.
24 దున్నేవాడు అసలు విత్తనాలే విత్తకుండా రోజంతా దున్నుతూ ఉంటాడా?
అస్తమానం నేలను చీలుస్తూ, దాన్ని గుల్ల చేస్తూ ఉంటాడా?+
25 అతను నేలను చదును చేయగానేనల్ల జీలకర్రను, జీలకర్రను చల్లడా?గోధుమల్ని, సజ్జల్ని, బార్లీ గింజల్ని వాటివాటి స్థలాల్లో నాటడా?అంచుల చుట్టూ పొడుగు గోధుమల్ని*+ వేయడా?
26 ఎందుకంటే దేవుడే అతనికి సరైన మార్గం బోధిస్తాడు;*అతని దేవుడే అతనికి ఉపదేశమిస్తాడు.+
27 నూర్చే పనిముట్టుతో+ నల్ల జీలకర్రను నూర్చరు,జీలకర్ర మీదికి బండి చక్రాన్ని ఎక్కించరు.
బదులుగా నల్ల జీలకర్రను కట్టెతో,జీలకర్రను చువ్వతో దుళ్లగొడతారు.
28 ఒక వ్యక్తి రొట్టె కోసం ధాన్యాన్ని నలగ్గొడతాడా?
లేదు, అతను అదేపనిగా దాన్ని నూర్చడు.+అతను తన గుర్రాలతో తన బండి చక్రాన్ని దానిమీద నడిపినప్పుడుఅతను దాన్ని నలగ్గొట్టడు.+
29 ఇది కూడా సైన్యాలకు అధిపతైన యెహోవా వల్లే కలుగుతుంది,ఆయన ఆలోచన* అద్భుతంగా ఉంటుంది,ఆయన సాధించేవి గొప్పగా ఉంటాయి.*+
అధస్సూచీలు
^ లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”
^ రాజధాని సమరయను సూచిస్తుందని తెలుస్తోంది.
^ లేదా “అహంకారంతో నిండిన; గర్వంతో నిండిన.”
^ లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”
^ లేదా “కొలనూలు వెంట కొలనూలు, కొలనూలు వెంట కొలనూలు.”
^ లేదా “సమాధితో పాటు దర్శనం చూశాం” అయ్యుంటుంది.
^ లేదా “మట్టపుగుండుగా.”
^ లేదా “వాళ్లు గ్రహించినప్పుడు విపరీతంగా భయపడతారు” అయ్యుంటుంది.
^ లేదా “భూమంతా.”
^ ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.
^ లేదా “క్రమశిక్షణ ఇస్తాడు; శిక్షిస్తాడు.”
^ లేదా “సంకల్పం; ఉద్దేశం.”
^ లేదా “ఆయన ఆచరణాత్మక తెలివి గొప్పగా ఉంటుంది.”